మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే…

కామారెడ్డి, మార్చ్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వ నిర్ణయం మేరకు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా కేటాయించడం జరిగిందని, ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. 2024-25 యాసంగి సీజన్‌ లో వరి ధాన్యం కోనుగోళ్ల పై గ్రామ అధ్యక్షులు, సబ్‌ కమిటీ, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

జిల్లాలో వరి ధాన్యం కోతలు ప్రారంభం అయ్యాయని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి అవసరమైన పరికరాలు క్యాలీపర్స్‌, టార్పాలిన్‌, తూకం యంత్రాలు, తేమ కొలిచే యంత్రం, తదితర పరికరాలతో పాటు కేంద్రంలో త్రాగునీరు, వేసవి దృష్ట్యా నీడ ఏర్పాటు, ఓ.ఆర్‌.ఎస్‌. పాకెట్స్‌, తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సన్న బియ్యం కు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. రబీ సీజన్‌ లో వడగళ్ల వానలు పడే ఆస్కారం ఉంటుందని, టార్పాలిన్‌ లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.17 శాతం తేమ ఉన్న వడ్లను కొనుగిలించేసుకోవచ్చని, దొడ్డు, సన్నం వడ్లను విడివిడిగా పెట్టాలని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యం ను ట్యాబ్‌ ఎంట్రీ చేసి మిల్లులకు తరలించాలని, రైతులకు రెండు రోజుల్లో చెల్లింపులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా జిల్లాలోని మహిళలకు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు కేటాయించడం జరిగిందని, పురుషులతో సమానంగా కొనుగోళ్లు చేయాలని తెలిపారు. అంతకుముందు వడ్లు కొనుగోళ్లు, కొలతలు వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శిక్షణ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ రాజేందర్‌, జిల్లా సహకార అధికారి రామ్‌ మోహన్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారిని రమ్య, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మురళీ కృష్ణ, మహిళా సంఘాల అధ్యక్షులు, ఏపిఎం.లు, సి.సి.లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తు గడువు పెంపు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »