నిజామాబాద్, మార్చ్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు.
అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ముస్లిం సోదరులు, అదే స్ఫూర్తితో సోమవారం నాటి ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.