డిచ్‌పల్లి, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాపు జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. బుదవారం వైస్ ఛాన్స్లర్ ఛాంబర్‌లో బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో భారత సమ్మిళిత వృద్ధి అనే అంశంపై ఈనెల 5వ తేదీన నిర్వహించే ఒకరోజు సెమినార్ బ్రోచర్‌ను వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య టీ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్, బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ ఆరతి, ఎస్సీ సెల్ డైరెక్టర్, డాక్టర్ వాణి, విమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ బ్రమరాంబిక ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైస్ – ఛాన్స్లర్ మాట్లాడుతూ బాపు జగ్జీవన్ రావ్ మానవీయ విలువలకు ప్రతిరూపమని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ పారదర్శకమైన పరిపాలన అందించిన బాపు జగ్జీవన్ రావ్ చిరస్మరణీయులని పేర్కొన్నారు.