కామారెడ్డి, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకమును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రజా పంపిణీ దుకాణం 14 కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాపంపిణీ దుకాణం సందర్శించి సన్న బియ్యం పథకము ప్రారంభించారు. బియ్యం యొక్క తూకమును నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడగా వారు సన్నబియ్యము పంపిణీ గురించి తమ సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా పంపిణీ దుకాణాలలో అధికారులతో అనగా ఆర్డీవోలు జిల్లా పౌరసరఫరాల అధికారి. సహాయ పౌర సరఫరాల అధికారి తహసిల్దార్లు డిప్ టీ తహసిల్దారులు డిటిసిఎస్, ఆర్‌ఐలతో తనిఖీలు చేయించారు. అందులో భాగంగా లబ్ధిదారులు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కడుపునిండా తింటున్నామని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు.