నిజామాబాద్, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సహకార సంఘాల బ్యాంకుల ద్వారా ఆర్థిక సంవత్సరం సాధించిన ప్రగతి రుణాల చెల్లింపులో ఆశాజనక ఫలితాలు వచ్చినందుకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకులో డిసిసిబి డైరెక్టర్లను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ సహకార బ్యాంకుల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సహకార సంఘాలు బలోపేతం కావాలంటే రైతులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే సహకార బ్యాంకులో మరింత అభివృద్ధిలోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి నాగభూషణం, డైరెక్టర్లు సాయిరాం, బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు