ఆర్మూర్, ఏప్రిల్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ ఆవరణలో గల రేషన్ దుకాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ బుధవారం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేస్తుందన్నారు. ఎన్నికల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు కానీ రేవంత్ సర్కార్ పేద ప్రజలకు సన్న బియ్యం పథకం అమలు చేసినందుకుగాను పేద ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన ఉంటూ సాధక బాధకాలు అర్థం చేసుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.