కామారెడ్డి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని గురువారం సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్ హౌస్ ను పరిశీలించారు. కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని పరిశీలించారు.
అనంతరం రామారెడ్డి డంపింగ్ యార్డ్ ను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలో పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిపిఓ మురళి, డి ఎల్ పి ఓ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, డిఆర్డిఏ పిడి సురేందర్, తహసిల్దార్ ఉమాలతా, ఎంపీడీవో తిరుపతి, ఎంఈఓ ఆనంద్ రావు, ఆర్ ఐ రవికాంత్, ఏపీఓ ధర్మారెడ్డి, వ్యవసాయ అధికారిని భాను శ్రీ, ఏపీవో ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.