కామారెడ్డి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియాన్ని చౌక ధార దుకాణాల ద్వారా అందజేస్తున్నామని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో చౌక ధార దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 47% సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డి లో 70 శాతం పంపిణీ పూర్తయిందని తెలిపారు.
లబ్దిదారులతో నేరుగా మాట్లాడామని, సన్న బియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రేషన్ షాపులో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లై అధికారులను సంప్రదించాలని ప్రజలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, డిపిఓ మురళి, డి ఎల్ పి ఓ శ్రీనివాస్, ఎమ్మార్వో ఉమలత, ఎంపీడీవో తిరుపతి, ఆర్ ఐ రవి కాంత్, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.