నిజామాబాద్, ఏప్రిల్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా నిజామబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో బాబు జగ్జీవన్ రావ్ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు ఈ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీహార్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలలో జన్మించి ఉన్నంత విద్య అభ్యసించి భారత స్వతంత్ర ఉద్యమం పాల్గొని మొట్టమొదటి భారత ప్రభుత్వంలో చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రిగా చేరి అనేక సంవత్సరాలు కొనసాగి దేశానికి సేవలు అందించాదాని కొనియాడారు అంటరాని వారీగా పరిగణించే సమాజానికి సమానత్వం సాధించినందుకు అనగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన శ్రమజీవిగా ఆయన చేసిన సేవలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో న్యాయవాదులు బంటు వసంత్, కిరణ్ కుమార్ గౌడ్, మాణిక్ రాజ్, ఆశా నారాయణ, ఎర్రం విగ్నేష్, భూమేశ్వర్, మేదరి శేఖర్, ఎస్ అశోక్, గోపాల్ రెడ్డి, రఘువీర్ చరణ్, నారాయణదాసు, రవి రాజ్ తదితరులు పాల్గొన్నారు.