బాన్సువాడ, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలోని రామాలయంలో రామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముడికి అభిషేకాలు నిర్వహించి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు రమాకాంత్ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాసరావు దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహా ప్రసాదాన్ని స్వీకరించారు. రామనవమి వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, యువ నాయకులు కాసుల రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, లక్ష్మారెడ్డి, దేవి కృష్ణ ప్రసాద్,, ప్రసాద్, సాయిబాబా,మోహన్ రెడ్డి, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.