నిజామాబాద్, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడిరగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్ డే ను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్ పెడిషన్ -2025 పేరుతో యాత్రను చేపట్టారు.
దేశ రాజధాని ఢల్లీి నుండి ప్రారంభం అయిన ఈ యాత్ర ఆగ్రా, కాన్పూర్, రaాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాం ల మీదుగా సాగుతూ, సోమవారం సాయంత్రం నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ఈ యాత్రకు జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీ.జీ కళాశాల మైదానంలో సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమృత్ నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడిరగ్ విన్యాసాలు అలరింపజేశాయి.

ఎన్.సీ.సీ క్యాడెట్లకు, యువతీ యువకులకు పారా గ్లైడిరగ్ పట్ల ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేశారు. యాత్రకు స్వాగతం పలికిన వారిలో డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, పోలీసు అధికారులు, ఎన్.సీ.సీ అధికారులు ఉన్నారు.