కామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సహకార సంఘాల ద్వారా ప్రజలకు, రైతులకు సేవలను అందించుటకు సహకార సంఘాల పునర్వ్యవస్తీకరించుటకు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్, అధ్యక్షులు ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా సహకార కమిటీ సమావేశం జరిగినది. జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. తదుపరి ఇట్టి ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించడం జరుగుతుందని తెలిపారు
కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి, తదితరులు పాల్గొన్నారు.