నిజామాబాద్, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తభ అలిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాది మహమ్మద్ ముత్తబా అలి పై దుండగులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దాడులకు నిరసనగా తమ విధులను బహిష్కరించి న్యాయస్థానాలలో విధులను దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. న్యాయవాది ముత్తబ్బ అలి దాడి చేసిన హంతకులను చట్టంముందు దోషులుగా నిలబెట్టి కఠినంగా శిక్షించాలని జగన్ కోరారు.దేశ,రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలు తాడులకు గురికావడం ఆవేదన కలిగిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. హత్యల దాడుల పరంపర ఆగాలంటే న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డిజిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల వృత్తి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం సహకరించాలని జగన్ కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావ్, ఉపాధ్యక్షులు పెండం రాజు, సంయుక్త కార్యదర్శి దొంన్పాల్ సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు అయ్యొబ్, విఘ్నేష్, పడేగేల వెంకటేశ్వర్, బిట్లా రవి, శ్రీధర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.