నందిపేట్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శనివారం సాయంత్రం నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య నందిపేట్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.
రిసెప్షన్, సిబ్బంది పనితీరు తనిఖీ, వాహనాల పార్కింగ్ పరిశీలించారు. రోడ్డు ప్రమాద నివారణకు సూచనలు చేస్తూ, గంజాయి నిర్మూలన పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గేమింగ్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించాలని పేర్కొన్నారు.
సిబ్బందితో ముఖాముఖి చర్చ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం.చిరంజీవి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.