పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్‌ క్యాంప్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్‌ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్‌ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్మూర్‌ రోడ్డులోగల ఆర్‌.బి.వి.ఆర్‌.ఆర్‌. పాఠశాలలో శిక్షణ శిబిరం ఉంటుందని, ఉచితంగా అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు.

అర్హతలు : 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థినులు ఇందుకు అర్హులని తెలిపారు.

శిక్షణా అంశాలు :

సెల్ఫ్‌ డిఫెన్స్‌

మోటివేషన్‌ సెషన్లు

పోలీస్‌ తరగతులు – మహిళల భద్రతపై అవగాహన

మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్‌ నెంబరు : 90009 94312

విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Check Also

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »