కామారెడ్డి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భీంరావ్ రాంజీ అంబేద్కర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఆదేశాల ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి జిల్లా అదనపు ఎస్పి కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏఎస్పి కె నరసింహ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రత్న, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరియు సమ్మిళిత సమాజాన్ని నిర్మించడంలో ఆయన కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అని, ఆ మహానీయులను స్మరింస్తూ మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఏఎస్పి బి. చైతన్య రెడ్డి మాట్లాడుతూ యువత అంబేద్కర్ జీవితం, బోధనల నుండి ప్రేరణ పొంది, రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం యొక్క విలువలను నిలబెట్టడానికి కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఇన్స్పెక్టర్ జార్జ్, ఆర్‌ఐ. కృష్ణ, ఆర్‌ఎస్‌ఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.