ఆర్మూర్, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో విశ్వ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆర్మూర్ మండల ఉమ్మడి ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై అంబేద్కర్‌కు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరివాడు అయన ఆలోచన, ఆచరణ ఆదర్శనీయం, అనుసరణీయం ప్రపంచం అయన సుట్టు తిరుగుతుందని, ప్రపంచ వ్యాపితంగా నేటికీ పదిలక్షల పైబడి అయన విగ్రహాలు పెట్టారని గుర్తుచేశారు.
కొందరు ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలను దిగజార్చేవిధంగా వ్యవహారిస్తున్నారని, రాజకీయంగా బలపడటానికి, వారి భావజాల వ్యాప్తికి కొందరికి రాజ్యాంగం అడ్డుగా మారడంతో దీనిని తొలగించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ కొందరి వాడిగా చేసే కుట్రలను బగ్నం చేసి సమసమాజ, సమతా మూర్తిగా బహుజన వాదులుగా మనమే ప్రపంచానికి మరో సారి పరిచయం చేయాలనీ కోరారు.
కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దమనుషులు, అంబేద్కర్ సంఘం నాయకులు, పూలె అంబేద్కర్, యువజన సంఘం నాయకులు, మాజీ ఎంపీటీసీ మంతెన సంజీవ్, మార్ల ప్రభాకర్, సమీర్, పచ్చుక రాములు, చిన్నా గంగారాం, మార్ల శివకుమార్, సామెల్ మంగ్లారం నవీన్, రొడ్డ రాజేశ్వర్, స్వరూప, సవిత, చెన్నవ్వ, లత, రాణి సోని, సాయమ్మ, ప్రజ్వల్ తదితరులు పాల్గొన్నారు.