కామారెడ్డి, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నేటి (17.4.2025) నుండి ఈ నెల 30 వరకు జిల్లాలోని మండల కేంద్రాల్లో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించబడునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన భూ భారతి కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అందులో భాగంగా ప్రతీ మండల కేంద్రంలోని రైతు వేదిక లేదా ఇతర ప్రాంతాలలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ నెల 17 న ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు పాల్వంచ రైతు కేంద్రంలో, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాచారెడ్డి మండలం గజియా నాయక్ తాండా రైతు వేదికలో నిర్వహించడం జరుగుతుందని, 19 న ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు నాగిరెడ్డిపేట రైతు వేదికలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
21 నా పిట్లం మండల కేంద్రంలో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు, పెద్ద కొడప్ గల్ రైతు వేదికలో మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు, 22 న రామారెడ్డి లో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు రైతువేదికలో, బిక్నూర్ రైతువేదికలో మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు, 23 న గాంధారి రైతువేదికలో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు, సదాశివనగర్ రైతువేదికలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 వరకు, 24 న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 వరకు మున్నూరు కాపు సంఘం, వీక్లీ మార్కెట్ కామారెడ్డిలో, తాడ్వాయి రైతు వేదికలో మధ్యాహ్నం 1.30 నుండి 3.30 వరకు, రాజంపేట రైతువేదికలో 3.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 25 న జుక్కల్ రైతు వేదికలో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు, బిచ్కుంద శాంతి మున్నూరుకాపు ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 వరకు, ఈ నెల 26 న బీబీపేట్ రైతువేదికలో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు, దోమకొండ రైతువేదికలో మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు, 28 న నిజాంసాగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 వరకు, మహమ్మద్నగర్ రైతు వేదికలో మధ్యాహ్నం 1.30 నుండి 3.30 వరకు, బాన్సువాడ రెడ్డి సంఘం లో మధ్యాహ్నం 3.30 నుండి 6 గంటల వరకు, 29 న డోంగ్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు, మద్నూర్ రైతువేదికలో మధ్యాహ్నం 2 నుండి 5 వరకు, 30 న బిర్కూర్ రైతువేదికలో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకు, నసురుల్లబాద్ రైతువేదిక లో మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన సదస్సులు నిర్వహించబడుతాయని కలెక్టర్ వివరించారు.
అవగాహన సదస్సులకు 200 మందికి తక్కువ కాకుండా మండలంలోని ప్రజలు, రైతులను ఆహ్వానించాలని, ముఖ్యంగా ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.