కామారెడ్డి, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కమారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా పశు కల్యాణ సమితిని బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సమితి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి పశువైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
నూతనంగా ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీలో భాగంగా…
అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్
డా. సంజయ్ కుమార్, జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి, కమారెడ్డి – కన్వీనర్‌గా
ఎం. మురళి, జిల్లా పంచాయతీ అధికారి, కామారెడ్డి
చంద్ర నాయక్, సీఈఓ, జెడ్పీ కమారెడ్డి,
శ్రీధర్ శర్మ, ఎన్జీవో ప్రతినిధి, కమారెడ్డి,
డా. ఏ. శ్రీనివాస్, సహాయక సంచాలకులు, పశువైద్యశాల, దోమకొండ సభ్యులుగా వ్యవహరిస్తారు.
సమితి జిల్లాలోని పశువైద్య ఆసుపత్రుల నిర్మాణ, పునరుద్ధరణ, ఆధునిక పరికరాల సమకూర్చడం, పశుసంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుసంధానంగా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తుంది.
ఈ పథకం ద్వారా గ్రామీణ పశుసంక్షేమ రంగానికి ఓ మైలురాయిగా సేవలు అందించాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, సంజయ్ కుమార్, జిల్లా పశు వైద్య అధికారి, తదితరులు పాల్గొన్నారు.