భీంగల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య భీంగల్ పోలీస్ స్టేషన్‌ను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. …
Read More »Daily Archives: April 17, 2025
లబ్దిదారుల జాబితా పక్కాగా పరిశీలించాలి…
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను పక్కాగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం ఎంపీడీఓ, ఎంపీఒ, ఆర్డీఓ, మున్సిపల్ కమీషనర్ లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 18 నుండి 21 వరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను పరిశీలించాలని, …
Read More »బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయంలోని ఛాంబర్ లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్, ఆమెకు పూల బొకేను అందించి, జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో …
Read More »దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
నిర్మల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు …
Read More »భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టం
నిజామాబాద్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు, ఏర్గట్ల మండలం బట్టాపూర్ లో భూభారతి నూతన చట్టంపై రైతులకు గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో కలెక్టర్ …
Read More »మాడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాల వారిని ఇందిరమ్మ ఇండ్ల జాబితా కు ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం పాల్వంచ, మాచారెడ్డి మండల కేంద్రాలలో ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిరుపేద వర్గాల కుటుంబాల వారిని ఎంపిక చేసే విధంగా ఆయా …
Read More »మాచారెడ్డిలో భూభారతి అవగాహన సదస్సు
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను నేటి నుండి జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా గురువారం పాల్వంచ, మాచారెడ్డి రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఏప్రిల్.17, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : చవితి మధ్యాహ్నం 12.00 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 5.02 వరకుయోగం : వరీయాన్ రాత్రి 10.02 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.00 వరకుతదుపరి కౌలువ రాత్రి 12.35 వరకు వర్జ్యం : ఉదయం 9.08 – 10.52దుర్ముహూర్తము : ఉదయం 9.54 – …
Read More »