బాన్సువాడ, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామాలలో డ్రగ్స్, గంజాయి కల్తీకల్లు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కోటిక్ డిఎస్పి సుబ్బరామిరెడ్డి, ఎక్సైజ్ పోలీస్ సిఐలు యాదగిరి రెడ్డి, మండల అశోక్ అన్నారు. శనివారం బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, ఇబ్రహీంపేట్, తాడ్కోల్ గ్రామాలలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీ కల్లుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కల్తీ కల్లు, డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల వల్ల ప్రజల అనారోగ్యం పాడు చేసుకోవద్దని, గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ యాదగిరి రెడ్డి, సిఐ మండల అశోక్, ఎంపీడీవో బశిరుద్దిన్, డిఎల్పిఓ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నవీన్ కుమార్, గీత, ప్రశాంతి, గ్రామస్తులు హన్మాండ్లు, నారాయణరెడ్డి, శ్రవణ్, బండి సాయిలు యాదవ్, పండరి, నవీన్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.