నిజామాబాద్, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండడంతో ఈ నెల 21న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేశామని అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి తిరిగి యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.