నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2024-25 విద్యా సంవత్సరానికి గాను గత మార్చి నెలలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలలో జిల్లాలో రెండవ సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు విద్య అధికారి రవికుమార్ పేర్కొన్నారు.
కాగా బాలికల ఉత్తీర్ణత శాతం పైచేయిగా నిలిచింది. మొత్తం బాలికలు రెండవ సంవత్సరంలో 70 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 45 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే మొదటి సంవత్సరంలో బాలికలు 64% సాధించగా బాలురు 41 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో రెండవ సంవత్సరం జనరల్ కోర్సులలో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరు కాగా వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 7,657 మంది హాజరుకాగా 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 6,288 మంది పరీక్షలకు హాజరు కాగా 2,808 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే రెండవ సంవత్సరం ఒకేషనల్ లో మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరుకాగా 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 814 మంది పరీక్షలకు హాజరుకాగా 666 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,228 మంది పరీక్షలకు హాజరు కాగా 565 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.
మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల విద్యార్థులు మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 8,035 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణుటైనట్టు తెలిపారు.
కాగా బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలికలు 1,111 మంది హాజరు కాగా వీరిలో 756 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,679 మంది పరీక్షలకు హాజరుకాక 467 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.