నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారి చేతులమీదుగా వాతావరణ మార్పులు దాని ప్రభావం, వడదెబ్బ నుండి రక్షించుకుందాం అనే పోస్టర్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ మార్పులు దాని ప్రభావం వల్ల తీవ్రమైన వేడి తో కూడిన ఎండలు ఉన్నందువల్ల జిల్లా ప్రజలంతా సరిjైున జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. ముఖ్యంగా వీలైనంతవరకు ఇంట్లోనే ఉండడం, సరిపడా ద్రవాలు తీసుకోవడం, కాటన్ వస్త్రాలను ధరించడం ,తొందరగా వడదెబ్బకు గురయ్యే వారు ఇతరుల కన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండడం, వివిధ శాఖల జిల్లా అధికారులు వడదెబ్బ నివారణ పైవారి ప్రణాళిక కనుగుణంగా చేయవలసినవి చేయకూడనివి పాటించేలా చూడాలన్నారు.
అదేవిధంగా యజమానులు వారి వద్ద పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అందరూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధాలు సరిపడా ఉంచుకొని, వడదెబ్బకు గురైన వారికి తక్షణమే చికిత్స అందించాలన్నారు. అదేవిధంగా ప్రజల్లో విస్తృతంగా వడదెబ్బపై అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, పి ఓ ఎన్ సి డి డాక్టర్ సామ్రాట్ యాదవ్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ నాగరాజు పాల్గొన్నారు.