మాక్లూర్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాక్లూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ అదేవిధంగా సిబ్బంది పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు. నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్‌ఐ రాజశేఖర్ ఉన్నారు.