కామారెడ్డి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తమ ఉన్నత డిగ్రీలైనా పీహెచ్డీ, నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్), సెట్ (స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ప్రదర్శిస్తూ మా ఉన్నత డీగ్రీలతో మాకు న్యాయం చేయండని శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని పార్ట్ టైం అధ్యాపకులు నాలుగవ రోజు నిరవధిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్ట్ టైం అసోసియేషన్ అధ్యాపకులు మాట్లాడారు.
తాము అనేక కష్టాలను పడి దేశం, రాష్ట్రంలోనే ఉన్నత చదువులైన పీహెచ్డీ, నెట్, సెట్ లను సాధించామని తెలిపారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో పరిశోనలు చేసి ఉన్నత అర్హతలను పొందమని అన్నారు. యూనివర్సిటీల వారు నిర్వహించిన అన్ని రకాల పరీక్షలలో ఉతీర్ణత సాధించి తాము పార్ట్ టైం అధ్యాపకులుగా వివిధ విభాగాలలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం తమ సేవలను గుర్తించలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అనగా ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్ అమలు, నియామకాలలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారికి యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు సైతం సంఫీుభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.