నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నగరంలో పారిశుద్ధ కార్మికులు క్రమశిక్షణను సమయపాలన పాటించాలని పారిశుద్ధ పనులలో ఉద్యోగులు అలసత్వాన్ని కలిగి ఉండరాదని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు.
శుక్రవారం వేకువజామున నిజాంబాద్లోని సర్కిల్ 5 జోన్లో ఈదుగా, మాలపల్లి, ధర్మ కాంఠ, మహమ్మదీయ కాలనీ, ఆర్ఆర్ చౌరస్తా రోడ్డు, పూలాంగ్ చౌరస్తా, ఆర్య నగర్ మొదలగు ప్రాంతాలలో పారిశుద్ధ పనులపై ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుల హాజరును పరిశీలించారు. కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్లు సానిటరీ ఇన్స్పెక్టర్ 5 సర్కిల్, సానిటరీ జవాన్లు, సర్కిల్ ఐదు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.