కామారెడ్డి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అటవీ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, అడవి కానీ ప్రాంతంలో చెట్లు నరికివేతకు అటవీ శాఖ అనుమతి జారీ చేయడం జరిగిందని తెలిపారు.
అడవి కానీ ప్రాంతంలో ఉన్న చెట్లను శాఖాపరమైన పద్ధతిలో పరిహారం చెల్లించి తొలగించవలసిందిగా రోడ్లు భవనాల శాఖను కలెక్టర్ ఆదేశించారు. అట్టి ఫారెస్ట్ రీచ్ లో స్టేజి 1 పర్మిషన్ కొరకు వెంటనే చర్యలు తీసుకొని పనులు మొదలు పెట్టవలసిందిగా ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ వీణ, రోడ్లు భవనాల శాఖ ఈఈ రవి శంకర్, ఎఫ్.డి. ఒ. రామకృష్ణ, ఎఫ్.ఆర్. ఒ. రవి, ఏఈఈ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.