నిజామాబాద్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ నగరంలోని ‘‘కేర్ డిగ్రీ కళాశాల’’ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రముఖ నృత్య గురువులు వినయ్ మరియు అమృత్ శిష్య బృందం చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అదేవిధంగా కూచిపూడి నృత్య గురువులు శ్రీనివాస్ శిష్యులు స్వాగత నృత్యం చేసి అలరించారు.
జ్యోతి ప్రజ్వలన తరువాత కశ్మీర్ పహల్గాం మృతులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. విద్యార్థులు ఇక్కడ నుండి సమాజానికి సేవ చెయ్యడానికి వెళ్లాలని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు. రేపటి భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని అన్నారు. విద్యార్థి దశలో మతాలకు అతీతంగా విద్యార్థులు ఉంటారని అంటారు.

కాలేజీలో చదివే విద్యార్థులు ‘‘భారతీయులు’’ అవుతారు, వారికి ఏ మతం ఉండదని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేశ్, కొయ్యాడ శంకర్, సందేష్, సందీప్, శ్రీనివాస్, నిసార్ అలి, మినాజ్, అరవింద్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.