నిజామాబాద్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి జి వి ఎన్ భరత లక్ష్మీ సోమవారం ఉదయం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు వేసవిలో పట్టెడు అన్నం కన్న గుక్కెడు నీళ్లు మంచిదని జిల్లా నలుమూలల నుండి కోర్ట్‌కు కక్షి దారులు వస్తారని అందుకే జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చలి వేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
ఇక్కడకు వచ్చే వారందరు సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కుటుంబ కోర్ట్ జడ్జి అశాలత, రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాస్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జి గోపి కృష్ణ, మేజిస్ట్రేట్లు కుష్బూ ఉపాధ్యాయ, శ్రీనివాస్ రావు, హరికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు. జి.పి.అమిదల సుదర్శన్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.