Monthly Archives: April 2025

మాక్లూర్‌ ఠాణా సందర్శించిన సిపి

మాక్లూర్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం సందర్శించారు. పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌ సెంటర్‌ అదేవిధంగా సిబ్బంది పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు. నార్త్‌ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌, మాక్లూర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ ఉన్నారు.

Read More »

భూభారతి’తో నిర్ణీత గడువులోపు భూ సమస్యలు పరిష్కారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్ణీత గడువు లోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్‌.ఓ.ఆర్‌ -2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. భీంగల్‌, వేల్పూర్‌ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఏప్రిల్‌ 24, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 10.14 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 6.53 వరకుతదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.42 వరకుయోగం : బ్రహ్మం మధ్యాహ్నం 12.30 వరకుకరణం : బాలువ ఉదయం 10.14 వరకుతదుపరి కౌలువ రాత్రి 9.18 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 …

Read More »

రైతుబిడ్డకు రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన జక్క రమణయ్య జక్కలక్ష్మి ప్రియల కుమారుడు జక్క రీషిత్‌ తేజ ఇటీవల విడుదలైనటువంటి పరీక్ష ఫలితాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. హైదరాబాద్‌ శ్రీ చైతన్య కళాశాలలో బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 437 మార్కులు వచ్చాయి. అందుకు కళాశాల ప్రిన్సిపల్‌ నరసింహారావు …

Read More »

ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో పార్ట్‌ టైం అధ్యాపకులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. నిరవధిక సమ్మెలో భాగంగా పార్ట్‌ టైం అధ్యాపకుల ఆధ్వర్యంలో మంగళవారం కాశ్మీర్‌ పహాల్గావ్‌లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ విద్యార్థులతో క్యాంపస్‌ ఆవరణలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలలో తమ సర్వీసులకు వెయిటేజీ ఇవ్వాలన్నారు. వెంటనే …

Read More »

రైతు సదస్సుల్లో 1080 దరఖాస్తులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలంలో జరుగుతున్న రైతు సదస్సులలో రైతులు సమర్పించిన దరఖాస్తులను క్యాటగిరి వారీగా పొందుపరచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం లింగంపేట మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు సదస్సుల దరఖాస్తుల పొందుపరచడం తీరును కలెక్టర్‌ పరిశీలించారు. మండలంలో ఇప్పటి వరకు 10 రెవిన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు, ఇప్పటి వరకు …

Read More »

మోడల్‌ సోలార్‌ విలేజ్‌ ఎంపిక కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో మోడల్‌ సోలార్‌ విలేజ్‌ ఎంపిక కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌, చైర్మన్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ సమావేశంలో జిల్లాలోని 5000 పైగా జనాభా కలిగిన 19 గ్రామాలను 2011 …

Read More »

రైతులకు భూములపై హక్కులు కల్పించేందుకే భూ భారతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. ఈ క్రమంలో ఎవరికైనా భూ సంబంధిత సమస్యలు ఉంటే వాటిని భూభారతి ద్వారా పరిష్కరించేందుకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, తద్వారా రైతులకు భూములపై పూర్తి భరోసా లభిస్తుందని అన్నారు. భూభారతి (భూమి హక్కుల …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఏప్రిల్‌.23, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 11.50 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.42 వరకుయోగం : శుక్లం మధ్యాహ్నం 2.55 వరకుకరణం : భద్ర ఉదయం 11.50 వరకుతదుపరి బవ రాత్రి 11.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.40 – 4.13దుర్ముహూర్తము : ఉదయం 11.33 …

Read More »

వడదెబ్బ నుండి రక్షించుకుందాం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గారి చేతులమీదుగా వాతావరణ మార్పులు దాని ప్రభావం, వడదెబ్బ నుండి రక్షించుకుందాం అనే పోస్టర్లను జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ స్థానిక సంస్థలు అంకిత్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ మార్పులు దాని ప్రభావం వల్ల తీవ్రమైన వేడి తో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »