Monthly Archives: April 2025

గల్ఫ్‌ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5వ తేదీన నందిపేట పోలీస్‌ స్టేషన్‌లో నందిపేట్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్‌ ఇచ్చిన దరఖాస్తు మేరకు, నిజామాబాద్‌ సిపి, పి. సాయి చైతన్య ఆదేశాల అనుసారం, నందిపేట్‌ పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌, ఇమిగ్రేషన్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దోందిగల భూమేష్‌, పబ్బ భూమేష్‌ రెడ్డి, అతని భార్య …

Read More »

డ్రగ్స్‌, కల్తీ కల్లుపై అప్రమత్తంగా ఉండాలి..

బాన్సువాడ, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో డ్రగ్స్‌, గంజాయి కల్తీకల్లు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కోటిక్‌ డిఎస్పి సుబ్బరామిరెడ్డి, ఎక్సైజ్‌ పోలీస్‌ సిఐలు యాదగిరి రెడ్డి, మండల అశోక్‌ అన్నారు. శనివారం బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌, ఇబ్రహీంపేట్‌, తాడ్కోల్‌ గ్రామాలలో డ్రగ్స్‌, గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీ కల్లుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కల్తీ …

Read More »

భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్‌ వ్యవస్థ

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా శనివారం మీసాన్‌పల్లి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్‌ కార్డుల సర్వే, త్రాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఎల్లారెడ్డి మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిరుపేదలకు ఇండ్లకు సిఫారసు …

Read More »

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ, రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. భూభారతి (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై శనివారం వర్ని , రుద్రూర్‌ రైతు వేదికలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ …

Read More »

లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీ.ఎస్‌. చౌహాన్‌ తో కలిసి సంబంధిత శాఖల మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ …

Read More »

సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌ లో సన్న బియ్యం లబ్ధిదారుడైన దళిత వర్గానికి చెందిన లింబాద్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

రైతు మహోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు మహోత్సవం ఏర్పాట్లను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న ఈ రైతు మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఏప్రిల్‌.19, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.55 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల ఉదయం 6.37 వరకుయోగం : శివం రాత్రి 9.12 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.55 వరకుతదుపరి భద్ర రాత్రి 2.01 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.37 వరకుమరల సాయంత్రం 4.37 – 6.17దుర్ముహూర్తము …

Read More »

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »