ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు.

ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈవీఎం ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, విజయేందర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, మే.4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »