బాన్సువాడ, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా నియామకమైన కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పట్టణంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నాయకులు కార్యకర్తల సమన్వయంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేస్తానన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతానని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.