కామారెడ్డి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పదవ తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచారెడ్డి విద్యార్థిని సబా తబస్సుమ్ అత్యధికం అత్యధిక మార్కులు 581 సాధించినందుకు గాను ఆమె శ్రమను మెచ్చి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ప్రత్యేకంగా సన్మానించారు.
ఇంతటి ఘనత సాధించినందుకు విద్యార్థినికి అభినందనలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ రమణ, గ్రామ పెద్దలు మహమ్మద్ అస్లాం, విద్యార్థి తల్లి పాల్గొన్నారు.