కామారెడ్డి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్ట నున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యార్థినిల స్కూల్ టాయిలెట్స్, సి.సి.రోడ్లు, ఫామ్ పాండ్స్ ,తదితర పనులకు రెండు రోజుల్లో ఆయా సంబంధిత అధికారులు మండలాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలకు అవసరమైన భూములను గుర్తించాలని సూచించారు. ప్రతీ వారం ఆయా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ఇంచార్జీ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, కామారెడ్డి, బాన్సువాడ పంచాయతీ రాజ్ ఈఈ లు దుర్గాప్రసాద్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.