డిచ్‌పల్లి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ మరియు బ్యాక్ లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్‌లకు) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుండి ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ అనివార్య కారణాల వలన పరీక్షలు 14వ తేదీకి బదులుగా ఈ నెల 16 తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు 24,500 విద్యార్థులు 32 సెంటర్లలో హాజరవుతారని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.