కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంగళవారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు.
ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. ఇంటర్లో ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిస్థాయి అడ్మిషన్లు జరగాలని తెలిపారు. విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం వారి సమయానికి అనుగుణంగా మార్చాలని కోరారు. సుమారు 15 జూనియర్ కళాశాలకు హాస్టల్ ఉండే విధంగా చూడాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు ఆదేశించారు. ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా కృషి చేయాలని కోరారు.
కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి మాట్లాడుతూ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రతి కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. అధ్యాపకులు ప్రతి గ్రామానికి తిరుగుతూ విద్యార్థులకు అడ్మిషన్లు పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.విద్యార్థులకు హాస్టల్ వసతి, బస్సు సౌకర్యం కోసం కలెక్టర్ సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రజిత, ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.