డిచ్పల్లి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ మరియు బ్యాక్లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్లకు) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుండి ప్రారంభమవుతాయని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 14 తేది నుండి సంబంధిత కళాశాలలో హాల్టికెట్లు పొందవచ్చునని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు.