కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళికి హైదరాబాద్ యశోద వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేశారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలను తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రక్తం అవసరం ఉంటుందని రక్తదాతలు మానవత దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తం అందజేస్తే ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు.