Yearly Archives: 2025

స్టాక్‌ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చౌక ధరల దుకాణాలలో స్టాక్‌ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ని మండలం జలాల్పూర్‌ గ్రామంలోని 8 వ నెంబర్‌ రేషన్‌ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి …

Read More »

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్‌ అంకిత్‌ గారు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సాత్విక్‌ తదితరులు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఏప్రిల్‌.3, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 3.28 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.26 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 7.56 వరకుతదుపరి సౌభాగ్యం తెల్లవారుజామున 5.17 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.26 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.28 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.24 వరకుమరల …

Read More »

మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి …

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాలో గల ఎస్సీ సంఘాల నాయకులు, బిసి, వివిద విద్యార్థి సంఘాల ప్రతినిదులుతో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ 134వ జయంతి, మాజీ ఉపప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ 118వ జయంతి మహోత్సవాల ఏర్పాటుకు సంబంధించి సన్నాహక సమావేశం బుధవారం మధ్యాహ్నం 3 …

Read More »

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకమును కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ బుధవారం ప్రజా పంపిణీ దుకాణం 14 కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాపంపిణీ దుకాణం సందర్శించి సన్న బియ్యం పథకము ప్రారంభించారు. బియ్యం యొక్క తూకమును నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడగా వారు సన్నబియ్యము పంపిణీ గురించి తమ సంతృప్తి వ్యక్తం …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌ రిబేటు సదుపాయం గడువు పొడిగింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌.ఆర్‌.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్‌.ఆర్‌.ఎస్‌ గడువును ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. …

Read More »

నిజామాబాదులో ఘనంగా డిసిసిబి బ్యాంక్‌ సంబరాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాల బ్యాంకుల ద్వారా ఆర్థిక సంవత్సరం సాధించిన ప్రగతి రుణాల చెల్లింపులో ఆశాజనక ఫలితాలు వచ్చినందుకు మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకులో డిసిసిబి డైరెక్టర్లను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్‌ కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ సహకార బ్యాంకుల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతి …

Read More »

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాపు జగ్జీవన్‌ రావ్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. బుదవారం వైస్‌ ఛాన్స్లర్‌ ఛాంబర్‌లో బాబు జగ్జీవన్‌ రావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో భారత సమ్మిళిత వృద్ధి అనే అంశంపై ఈనెల 5వ తేదీన నిర్వహించే ఒకరోజు …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, అదనపు కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »