కామారెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం కింద కామారెడ్డి జిల్లాకు 350 యూనిట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్ల పై చర్చించారు. దళిత సాధికారిత కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు.
దళిత బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయంతో లబ్ధిదారులు ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే వారికి ఉపాధి కలుగుతుందో అనే అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. శాఖల వారీగా లబ్ధిదారులకు అనువైన యూనిట్లను తయారు చేయాలని సూచించారు. సీఆర్పీలు ద్వారా లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఆర్టీవో వాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.