నేడు 36 నామినేషన్లు దాఖలయ్యాయి…

కామారెడ్డి, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 36 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా, మరో 12 మంది అభ్యర్థులు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎలారెడ్డి నియోజకవర్గం నుండి ఆరుగురు ఒక్కో నామినేషన్‌ దాఖలు చేశారని అన్నారు.

జుక్కల్‌ నియోజక వేఉర్గం నుండి ఒక అభ్యర్థి 3 నామినేషన్లు, ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు వేయగా మరో 7 గురు ఒక్కో సెట్‌ బీచొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని కలెక్టర్‌ వివరించారు. కామారెడ్డి నియోజక వర్గంలో రాజ్యాధికార పార్టీ నుండి పంపారు నరసింహ నరేందర్‌ రెండు సెట్లు, బిజెపి నుండి కోటిపల్లి వెంకటరమణ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు. కాగా బహుజన సమాజ్‌ పార్టీ నుండి ఊడ్తవార్‌ సురేష్‌ గౌడ్‌,, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుండి అనుముల రేవంత్‌ రెడ్డి, అలియాన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ నుండి లింగాల ముత్యం, ఫంబహుజన లెఫ్ట్‌ పార్టీ నుండి సిద్దిరాములు సిరిగద్ద ఒక్కో నామినేషన్‌ వేశారు.

స్వతంత్ర అభ్యర్థులుగా బొడసు నరసింహులు, అర్రోళ్ల నరేష్‌, చిందం మల్లయ్య, నీల నాగరాజు, ఆకుల హరీష్‌, చెవుల పరశురాములు, దొడ్లే రాజేందర్‌, బుట్టెమ్‌ గారి మాధవ రెడ్డి ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని కలెక్టర్‌ పేర్కొన్నారు. జుక్కల్‌ నియోజక వర్గం లో బీజీపీ అభ్యర్థి టి.అరుణతార మూడు సెట్లు, భారతీయ రాష్ట్ర సమితి నుండి హనుమంత్‌ షిండే రెండు సెట్లు, బి.ఆర్‌.ఎస్‌. నుండి శోభావతి షిండే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

బహుజన్‌ భారత్‌ పార్టీ నుండి బాబు ఆర్‌. ధర్మ సమాజ్‌ పార్టీ నుండి భూమయ్య పనగంటి వారి, ఇండియా ప్రజాబంధు పార్టీ నుండి గ్గ రాజు, తెలంగాణ రాజ్య సమితి నుండి బొగుడమీద సాయిలు, స్వతంత్ర అభ్యర్థులుగా గంగారాం, గైని ప్రేమ్‌ కుమార్‌, గైక్వాడ్‌ ప్రకాష్‌లు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని కలెక్టర్‌ తెలిపారు.

అదేవిధంగా ఎల్లారెడీ నియోజకా వర్గం నుండి బహుజన సమాజ్‌ పార్టీ నుండి శ్రేమతి జామున రత్ల , ఆమ్‌ ఆద్మీ పార్టీ నుండి అమర్‌ సింగ్‌ భమన్‌ , ధర్మ సమాజ్‌ పార్టీ నుండి శామ్‌ బుగళ్ళ లక్ష్మయ్య, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుండి కె. మదన్‌ మోహన్‌ రావుతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నేనావత్‌ బాధ్య నాయక్‌, బంతిలాల్‌ మాంజ ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని కలెక్టర్‌ పాటిల్‌ తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »