ప్రజావాణిలో 41 ఫిర్యాదులు

కామారెడ్డి, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.

ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్‌ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారించాలని కోరారు. ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చే దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. సోమవారం ప్రజావాణి కి మొత్తం 41 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిఆర్డిఓ సాయన్న, ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »