పరీక్షకు 649 మంది గైర్హాజరు

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శుక్రవారం ఇంటర్‌ పరీక్షల్లో ఒకరి పై మాల్ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 649 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. ఏడవ రోజు శుక్రవారం మొదటి సంవత్సరం గణిత శాస్త్రం-1, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. శుక్రవారం మొత్తం 14,984 మంది విద్యార్థులకు గాను 649 మంది విద్యార్థులు గైర్‌ హాజరు కాగా 14,335 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 95.7 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి తెలిపారు.

ఇంటర్‌ విద్యా ఆధికారి జిల్లా కేంద్రంలోని కాకతీయ మహిళా జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం, శ్రీ కాకతీయ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం, ఎస్‌.ఎస్‌.ఆర్‌. పరీక్ష కేంద్రము, నిర్మల హృదయ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రం, కంటేశ్వర్‌ లోని ఎస్‌.ఆర్‌. జూనియర్‌ కళాశాల ను తనిఖీ చేసి సమీక్షించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ధర్మారం రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల, డిచ్పల్లి మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాల, ధరపల్లి మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాల, ధరపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తనిఖీ చేశారు.

పరీక్షల నిర్వహణ కమిటీ మరో సభ్యుడు చిన్నయ్య నిజామాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఉమెన్స్‌ జూనియర్‌ కళాశాల, ఎస్‌.ఆర్‌. జూనియర్‌ కళాశాల, ఆర్మూర్‌ రోడ్‌ లోని ఎస్‌.ఆర్‌.జూనియర్‌ కళాశాల తనిఖీ చేశారు. అలాగే హైపవర్‌ కమిటీ రవికుమార్‌ 5 పరీక్ష కేంద్రాలను బాల్కు అధికారి రజియుదిను మరో ఐదు కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం శుక్రవారం బాల్కొండ మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాలలో కాపీ చేస్తున్న ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేశారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »