గాంధారి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలోని వాగులో సంగెం రేవు వద్ద నిర్మించే చెక్ డ్యామ్ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని క్లస్టర్‌గా తీసుకోని 16 చెక్ డ్యామ్‌లను ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంజూరు చేశారని ఆయన తెలిపారు. సుమారు 36 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం కొనసాగుతుందని అన్నారు.
అందులో గాంధారి మండలానికి 7 చెక్ డ్యామ్‌లు మంజూరు అయ్యాయని అన్నారు. ముదేల్లిలో 2, సంగేమ్లో 3, గాంధారిలో 2 చేక్ డ్యామ్‌ల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. ఇదివరకే బామన్ రేవు వద్ద నిర్మాణ పనులు ప్రారంభించగా, బుధవారం సంగేమ్ రేవు వద్ద కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఒక్కో చెక్ డ్యామ్ వ్యయం సుమారుగా 75 లక్షలు ఉంటుందని ఇరిగేషన్ ఏఈ దత్తాత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు తూర్పు రాజులు, పత్తి శ్రీనివాస్, నాయకులు నితిన్ పాటిల్, నీల రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.