కామరెడ్డి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం ద్వారా రూ.30.37 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ప్రత్యక్ష వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
గత మూడు రోజుల నుంచి గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యక్ష వేలం నిర్వహించినట్లు చెప్పారు. మొదటిరోజు రూ.14.91 కోట్లు, రెండవ రోజు రూ.11.98 కోట్లు, మూడవరోజు రూ.3.48 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. బుధవారం 49 ప్లాట్లకు వేలం పాట నిర్వహించారు. వీటిలో 40 ఫ్లాట్లు విక్రయించారు. 9 ప్లాట్లకు రేపు వేలం వేస్తామని పేర్కొన్నారు. గురువారం నలభై తొమ్మిది ప్లాట్లకు వేస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.