నిజామాబాద్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో కార్మికులకు ఈ.ఎస్.ఐ అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ.ఎస్.ఐ జిల్లా మేనేజర్ మాల్యాద్రి గారు మాట్లాడుతూ కార్మికులకు ఈఎస్‌ఐ కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కష్టకాలంలో కార్మికులను ఆదుకోవడానికి ఈఎస్‌ఐ అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఈ.ఎస్.ఐ సౌకర్యాలు పొందడం కార్మికుల హక్కు అన్నారు. కార్మికుల సొమ్ముతో, కార్మికుల కోసం పనిచేస్తున్న సంస్థ ఈఎస్‌ఐ అన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. కార్మికులు ఈఎస్‌ఐ సౌకర్యాలు పొందడంలో కార్మిక సంఘాలు వారధిలా పనిచేయాలన్నారు.
ఈ.ఎస్.ఐ అందిస్తున్న ఆర్థిక భరోసా, వైద్య సౌకర్య పథకాలను కార్మికులకు వివరించారు. అవగాహన సదస్సులో ఈ.ఎస్.ఐ అసిస్టెంట్ మేనేజర్ రమేష్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర నాయకులు ఎం.వెంకన్న, నాయకులు డి.కిషన్, సాయగౌడ్, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, విఠల్, కిరణ్, రాజేశ్వర్, శివ కుమార్, శాంతి కుమార్, రవి, సాయితేజ బాలాజీ, కార్మికులు పాల్గొన్నారు.