నిజామాబాద్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హోళీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, అభివృద్ధి పథాన అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు.