నిజామాబాద్, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తెలంగాణ షెడ్యూల్డు కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26 , 27 వ తేదీలలో షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 26, 27 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆడిటోరియంలో మసాబ్ ట్యాంక్ హైద్రాబాదులో మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. ఈ నెల 26 వ తేదీన ఉదయం 10-30 గంటలకు ప్రారంభం అనంతరం మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 4.00 వరకు మల్లెపల్లి లక్ష్మయ్య బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దళిత బంధు, ఎస్.సి సబ్ ప్లాన్‌పై అవగాహన, సీనియర్ జర్నలిస్టు బుర్రా శ్రీనివాస్ సాయంత్రం 4.00 నుండి సాయంత్రం 5.00 వరకు డిజిటల్ మిడియాపై ప్రసంగిస్తారని తెలిపారు.
27 వ తేదీన ఉదయం 11-00 గంటలకు చిల్ల మల్లేశం సీనియర్ జర్నలిస్టు పత్రికల భాష తప్పొప్పులు దిద్దుబాటుపై, మధ్యాహ్నం 12.00 ప్రొఫెసర్ ఘంట చక్రపాణి దళిత జర్నలిస్టుల ప్రత్యేక అస్తిత్వం, జర్నలిజంలో దళితుల భాగస్వామ్యం పాత్ర అనే అంశంపై గోవింద్ రెడ్డి మధ్యాహ్నం 2-00 గంటలకు నేర వార్తలు అనే అంశంపై, మధ్యాహ్నం 3-00 గంటలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారితాలు అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న ప్రసంగిస్తారని తెలిపారు.
శిక్షణా కార్యక్రమాలు ప్రతి రోజు ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు కొనసాగుతాయని, శిక్షణ పూర్తి చేసిన జర్నలిస్టులకు సర్టిఫికేట్లను అందజేస్తారని ఆయన తెలిపారు. శిక్షణ తరగతులలో భాగంగా వృత్తి నైపుణ్యం పెంపొందించే విధంగా తెలంగాణ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని ఆయన అన్నారు.
శిక్షణకు హాజరయ్యే జర్నలిస్టులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని అన్నారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ఎస్సీ జర్నలిస్టులు అందరూ శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిక్షణకు ఆసక్తిగల జర్నలిస్ట్‌లు ఈ నెల 23 వ తేదీ లోగా కార్యాలయ పని వేళల్లో డిపిఆర్‌వో కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
నేరుగా గానీ లేదా డిపిఆర్‌వో కార్యాలయం సహాయకులు గణేష్ మొబైల్ నంబర్ 9963375242 కు కాల్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిక్షణా తరగతులను జిల్లాలోని ఎస్సీ జర్నలిస్టులందరూ సద్వినియోగపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో కోరారు.